నిర్మల్ (విజయక్రాంతి): అదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణం పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి అరవింద్(MLA Dharmapuri Aravind) మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో నిర్మల్ ఆర్మూర్ లైన్ రైల్వే పనులపై చర్చించారు సర్వే పనులు పూర్తి చేసి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి వారు విన్నవించారు.