09-03-2025 04:36:19 PM
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గైని పోచయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, గ్రామస్థులు పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డా. బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరికీ గౌరవకరం అన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుడు దేశానికి ఎంతో గర్వకారణమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాములు, కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శి సాయిరాం, శ్రీకాంత్, నాగయ్య, లింగయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.