10-03-2025 07:01:10 PM
జిల్లా కలెక్టర్ తో కలిసి స్థలాలను పరిశీలించిన ఎమ్మెల్యే..
ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రి, ఐటిఐ కళాశాల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ తో కలిసి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. రూ. 38 కోట్లతో వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సకల సదుపాయాలతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఐటిఐ కాలేజ్ భవన నిర్మాణం రూ. 11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ భవనం నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందులో అనువైన స్థలాలను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ, సింగరేణి స్థలాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం వీసం కృష్ణయ్య, తహసీల్దార్ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.