calender_icon.png 19 January, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డును కబ్జా చేసిన నిర్మాణ సంస్థ

07-12-2024 02:10:06 AM

మణికొండ మున్సిపాలిటీలో ఘటన 

రాజేంద్రనగర్, డిసెంబర్ 6: ఓ బడా నిర్మాణ సంస్థ రోడ్డును దర్జాగా కబ్జా చేసిన విషయం మణికొండ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. పుప్పాలగూడ రోడ్డులో డీఎన్‌ఎస్ నిర్మాణ సంస్థ ఓ నిర్మాణం చేపట్టింది. సెల్లార్ ర్యాంప్‌నకు సంబంధించి సుమారు 15 ఫీట్ల రోడ్డును ఆ సంస్థ నిర్వాహకులు కబ్జా చేశారు. రోడ్డు స్థలాన్ని కబ్జా చేయడం దారుణమని స్థానికులు మండిపడ్డారు. మున్సిపల్, రెవెన్యూ అధికా రులు చర్యలు తీసుకుని, రోడ్డు స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.