calender_icon.png 30 April, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కు స్థలంలో నిర్మాణం

30-04-2025 12:00:00 AM

నేలమట్టం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు

రాజేంద్రనగర్, ఏప్రిల్ 29: పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టగా టౌన్ ప్లానింగ్ అధికారులు దానిని నేలమట్టం చేశారు. వివరాలు.. బండ్లగూడ జాగీర్ ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనిఎస్ టీ మైఖే ల్ కాలనీ లో కొందరు పార్కు స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయమై స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకున్న మున్సిపల్ అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. కమిషనర్ శరత్ చంద్ర ఆదేశాల మేరకు ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారిణి జి.వాణి, సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు.