calender_icon.png 5 January, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ చేశాక నిర్మాణాలా?

03-01-2025 01:57:50 AM

* ఆ అధికారులపై చర్యలు తీసుకోండి

* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లి గ్రామంలో శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ వ్యవహారంలో చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాల ని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ ఇతరులపై చర్య లు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ టీ వినోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాజెక్టు కోసం సేకరించిన తన భూమికి పరిహారం చెల్లించాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన రాళ్ల శ్రీనివాసాచారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

భూసేకరణ నోటిఫికేషన్ జారీ తర్వాత ప్రభు త్వం స్వాధీనం చేసుకున్న పిటిషనర్ భూమిలో గ్రామ పంచాయతీ, మండల అధికారుల అనుమతితో నిర్మాణాన్ని చేపట్టడంపై న్యాయ మూర్తి ఆగ్ర హం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్ అమల్లో ఉండగానే అధికారులు నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు.

చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికా రులపై చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. ఇదే సమయంలో పిటిషనర్ పరిహారాన్ని కోరజాలరని స్పష్టంచేశారు.  

ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై నివేదికివ్వండి

హెచ్‌ఎండీయే పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్ గుర్తింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తుది నోటిఫికేషన్ జారీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు ఫిబ్రవరి 4లోగా సమర్పించాలని ఆదేశించింది.

హెచ్‌ఎండీయే పరిధిలోని రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎఫ్‌టీఎల్ అంశాన్ని వేరుచేసి సుమోటో పిటిషన్‌గా తీసుకున్న విషయం విధితమే.

ఈ సుమోటో పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హెచ్‌ఎండీయే పరిధిలో 3,342 చెరువులున్నాయని తెలిపారు.

ఇందులో 2,793 చెరువులకు ఎఫ్‌టీఎల్ గుర్తింపునకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసినట్టు తెలిపారు. 708 చెరువులకు ఎఫ్‌టీఎల్ గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ జారీచేసినట్టు చెప్పారు.

హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన తరువాత మరో 57 చెరువులకూ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్టు వివరించారు. మిగిలిన చెరువులకు ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్ జారీ చేయడానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించడానికి గడువు కావాలని కోరారు. ఈ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నేరెళ్లలో బాధితులకు పరిహారం ఇచ్చారా?

* ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

* పోలీసులపై కేసు పెట్టామన్న సర్కార్

సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీ సులపై నమోదు చేసిన కేసు పురోగతి ఏదశలో ఉందో నెల రోజుల్లో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం ఇచ్చారో లేదో, పోలీ సులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారో లేదో చెప్పాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

కేసు వివరాలు తెలుసుకోకుండానే కోర్టు హాలుకు వచ్చి వాయిదా కోరడం సబబు కాదని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 2017 జూలై 2న నేరెళ్లకు చెంది న ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోవడంతో స్థానికులు ఆగ్రహంతో ఐదు ఇసుక లారీలను దహనంచేశారు.

దీంతో13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాలా బాలరాజు, పసుల ఈశ్వర్‌కుమా ర్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళ్లకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్‌ను పోలీసులు అదే ఏడాది జూలై 7న రాత్రి 11.30 గంటలకు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనలో దళితులు, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన అప్పటి ఎస్పీ విశ్వజిత్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని, బాధితులకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించింది. వీటిని చీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టిన సందర్భంగా నాడు అక్రమాలకు పాల్పడిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా? బాధితులకు పరిహారం చెల్లించారా? అని ప్రభుత్వాన్ని అడిగింది. 

దీనిపై ప్రభుత్వ న్యాయవాది నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో ఆగ్ర హం వ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడం కోసమే విచారణకు హాజరుకావడాన్ని తప్పుబట్టింది. దీంతో అదనపు ఏజీ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ విచారణకు హాజరయ్యారు.

పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. పూర్తి వివరాల నిమిత్తం విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.