14-04-2025 12:53:35 AM
మాజీ ఎంపీ సోయం బాపూరావ్
ఆదిలాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : భావితరాల వారి భవిష్యత్తు బాగుండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం అనివార్యం అని మాజీ ఎంపీ సోయం బాపూ రావ్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని గుండాల, సిరిచెల్మ గ్రామం లో జై బాపూ.. జై భీమ్... జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహిళలు, యువకులు, గ్రామస్థులతో కిలిసి మాహాత్మ గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలతో గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాజీ ఎంపీ సోయం బాపూరావ్ మాట్లాడుతూ రాబో యే రోజుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను గ్రామాల నుండి బహిష్కరించాలన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అని వాటిని తుద ముట్టిస్తేనే ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీల బలోపేతం అవుతుందన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా భారత సంవిధనాన్ని మార్చుతూ కుల, మత వర్గ విభేదాలను సృష్టిస్తూ ప్రజల మధ్యన విద్వేష రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని ఆరోపించారు. విద్వేష, విభజన, మత, కుల, రాజకియాలను అడ్డుకోనీ అభివృద్ధి, లౌకిక, సామ్యవాద రాజకీయాలకు కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంరం కోటేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్లెం నారాయణ రెడ్డి, మైనారిటీ విభాగం నియోజకవర్గ చైర్మన్ ముస్తఫా, ఎస్సి విభాగం నియోజకవర్గ చైర్మన్ కొత్తూరీ లక్ష్మన్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసిఫ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.