calender_icon.png 27 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ వజ్రోత్సవాలు

27-10-2024 01:15:13 AM

ఏడాది పొడవునా 

దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్

పాత పార్లమెంట్ భవనం వేదికగా వేడుకలు

 ఢిల్లీ, అక్టోబర్ 26: భారత రాజ్యాంగం యావత్ దేశానికే అత్యున్నత గ్రంథం. రాజ్యాంగం రూపొంది 74ఏళ్లు పూర్తుంది. నవంబర్ 26న 75వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందు కు సిద్ధమైంది. మోదీ ప్రభుత్వం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతోంది. వజ్రోత్సవాల సందర్భంగా ఈ ఏడా ది మొత్తం సంబరాలు జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం పై చర్చించారు. కొత్త పార్లమెంట్‌లో కార్యకలపాలు ప్రారంభమైన తర్వాత పాత పార్ల మెంట్ భవనాన్ని సంవిధాన్ సదన్ పేరుతో పిలుస్తున్నారు. ఇందులోని సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సమావేశాలతోపాటు సెమినార్‌లను ఏర్పా టు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.