19-04-2025 09:25:15 PM
డిసిసి అధ్యక్షురాలు సురేఖ..
మంచిర్యాల (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బిజెపి ఎజెండాగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగ సవరణ ప్రయత్నాల వల్ల రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడనుందని మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా శనివారం హజీపూర్ మండలం ర్యాలీ గ్రామం నుంచి గడ్ పూర్ వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకోర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, మండల కోఆర్డినేటర్, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.