08-04-2025 06:11:25 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు వెలుగనూరు, వడ్డేపల్లి, మల్లూరు, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు పండరి, ప్రవీణ్ కుమార్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.