02-04-2025 10:05:30 PM
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. "జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్" కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ బూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళుతుంటే మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారంగుల అశోక్ రెడ్డి, మైనార్టీ సెల్ కన్వీనర్ సిరజ్, ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్ లు పోదర్ల రాజు, పిడుగు మమత సాయిబాబు, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, తెజాపు ప్రసాద్, పీప్పిరి చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, జావిద్, సన్ని మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.