24-03-2025 12:13:55 AM
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి
మహబూబ్ నగర్, మార్చి 23 ( విజయక్రాంతి ) : ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీమ్, జైసంవిదాన్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టను న్నట్లు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జైబావు, జైభీమ్, జైసంవిదాన్ అభియాన్ రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశాన్ని ఇటీవలే నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాల సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయని, ఈనెల 28లోపు మండలస్థాయిలో కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ ఏఐసీసీ అధ్యక్షు డిగా ఎన్నికై వందేళ్లు పూర్తయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్నదన్నారు.
అంబేద్కర్ ను పార్లమెంట్లో కేంద్రహోంమంత్రి అమిత్ అత్యంత హీనంగా అవ మానపర్చారని అన్నారు. అమిత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతోపాటు దేశ ప్రజలందరూ డిమాండ్ చేశారని, కాని ఆయన చేయలేదన్నారు. మహాత్మాగాంధీ. అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతో జై బాపు, జైభీమ్, జైసంవిదాన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాగంగా ఏడాదిపాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరీరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం రెండు గ్రామాలు, సాయంత్రం రెండు గ్రామాలు పాదయాత్ర చేపట్టి మహాత్మాగాంధీ, అంబేడ్కర్ సిద్ధాంతాలు. రాజ్యాంగ విలువలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.
సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కౌత్వాల్, జైబాపు, జైబీమ్, జై సంవిదాన్ రాష్ట్ర కోల్డర్డినేటర్ సతీష్, మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహార్, నా యకులు చంద్రకుమార్ గౌడ్, సంజీవ్ ము దిరాజ్, ఎన్పి.వెంకటేశ్ , ఏపీ మిథున్ రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.