calender_icon.png 22 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగాన్ని చదివించాలి

22-01-2025 05:34:15 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యా సంస్థలలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిరోజు ప్రార్థన సమయంలో చదివించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహరాజ్ అన్నారు. లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలంలోని పోస్ట్ బాక్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలను పంపించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. భారతదేశ సమస్తాన్ని శాసనం రూపంలో నడిపించే భారత రాజ్యాంగం అని అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అందుకని ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు ప్రార్ధనా స్థానంలో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామమన్నారు. భారత రాజ్యాంగ విలువలు సమాజానికి తెలియకుండా ఇన్నేళ్లు అగ్రకుల పాలకులు ప్రజలను మోసం చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారు ఉద్యమాన్ని చేపడుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, అడెల్లు, సుష్మ, వెంకటేష్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.