calender_icon.png 27 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగం జీవన మార్గం

27-11-2024 02:00:18 AM

  1. దేశ నాగరికతకు ప్రతిరూపం
  2. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  3. హైకోర్టులో రాజ్యాంగ అవతరణ దినోత్సవం

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజ్యాంగం జీవనమార్గమని, అది దేశ నాగరికతకు ప్రతిబింబమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభివర్ణించారు. హైకోర్టు ఆవరణలో మంగళవారం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం వెన్నెముకలా నిలు స్తుందన్నారు.

రాజ్యాంగం నైతికత అనే సహజనమైన భావనకాదని, ఇది జీవన మార్గమ ని కొనియాడారు. అంబేద్కర్ వంటి ఎంతో మంది ప్రముఖుల మేధస్సు, అంకిత భావం, త్యాగాల ఫలితంగానే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదిగా ఖ్యాతి గాంచిందని కొనియాడారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే మాట్లాడుతూ.. రాజ్యాంగం న్యాయ పత్రం కాదనీ, ఇది ప్రజలకు నైతిక దిక్చూచి అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగానికి రక్షణగా సుప్రీం కోర్టు ఉంటుందన్నారు. న్యాయానికి రక్షకులుగా రాజ్యాంగ పవిత్రను కాపాడే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు,  బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు శాంతిభూషణ్ సంజీవ్ కుమార్ సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి నవీన్ పాల్గొన్నారు.