సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
గజ్వేల్, జూలై 18: బీజేపీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కి ప్రశ్నించే గొంతుకలను ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గజ్వేల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల మద్దతుతోనే మోదీ ప్రధానిగా ఎన్నికయ్యారని, బీజేపీకి ప్రజల పూర్తి మద్దతు లేదన్నారు.
ఉపాధి హామీ బడ్జెట్‌ను పెంచి కూలీలకు రోజుకు రూ.700 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆపొద్దని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ ప్రజల సమస్య లు తీరాయని గొప్పగా చెప్పారని, కానీ సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయని పేర్కొ న్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పని చేస్తుందన్నారు. నాయ కులు వెంకట్‌రాంరెడ్డి, ప్రకాశ్‌రావు, శివలింగుకృష్ణ, దయానందరెడ్డి పాల్గొన్నారు.