calender_icon.png 26 November, 2024 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పార్లమెంటులో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమం

26-11-2024 11:12:11 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో 'రాజ్యాంగ' ప్రత్యేక కార్యక్రమం మంగళవారం జరుగనుంది. రాజ్యంగం ఆమోదం పొంది 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము రాజ్యాంగం ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొననున్నారు. 


భారతదేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. రాజ్యంగ వజ్రోత్సవాల సందర్భంగా constitution75.com పేరిట కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ రూపకల్పన చేయనున్నారు. రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు వెబ్ సైట్ లో అందరికి అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందించారు. ఈ రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలను ఏడాదిపాటు నిర్వహించాలని, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనల వీడియోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేలా వీలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.