మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట: మెదక్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, శానాయిపల్లి గ్రామాలలో సి ఆర్ ఆర్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, గత పదేళ్లలో మెదక్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అందరి సహకారంతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవిందు నాయక్, నాయకులు శ్రీకాంతప్ప నర్సింలు గుప్త తదితరులు పాల్గొన్నారు.