నల్లగొండ/ గద్వాల (వనపర్తి), ఆగస్టు 26 (విజయక్రాంతి): కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం 25 గేట్ల నుంచి సోమవారం 1.20 లక్షల క్యూసెక్యుల వరద తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు మధ్యాహ్నం 24 గేట్లు ఎత్తి దిగువకు జలాలు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వసామర్థ్యం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.61 మీటర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 1.29 లక్షల క్యూసెక్కుల జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి విడుదలవుతున్నాయి. నాగార్జున సాగర్‌కు స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
ఇన్‌ఫ్లో తగ్గడంతో ఇప్పటికే అధికారులు ప్రాజెక్టు క్రస్ట్టు గేట్లను మూసేశారు. ఎగువ నుంచి 49 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా రిజర్వాయర్ నుంచి అంతేమొత్తంలో అవుట్ ఫో ్లకొనసాగిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 69 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 29 వేల క్యూసెక్కులు జలాలు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగుల వద్ద స్థిరంగా ఉన్నది.తెలంగాణలో గోదావరి ప్రవాహం సైత ఉంది. సోమవారం సాయంత్రం సమ్మక్క సాగర్ వద్ద 3.80 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది.
ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా..
కృష్ణా బేసిన్.. (సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి)
ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కులో) (క్యూసెక్కుల్లో)
అల్మట్టి 129.72 ౧౨౬.౫౬ ౯౦౦౦౦ ౧౨౦౦౦౦
నారాయణపూర్ 37.64 ౩౪.౬౯ ౧౧౦౦౦౦ ౧౨౦౮౦౦
ఉజ్జయిని 117.24 117.24 ౯౩౮౨౬ ౮౧౦౦౦
జూరాల 9.66 ౭.౮౬ ౯౩౦౦౦ ౧౨౯౨౨౮
తుంగభద్ర 105.79 8౬.౮ ౧౭౩౧౧ ౧౦౩౪౫
శ్రీశైలం 215.81 ౨౧౦.౪౫ ౧౨౯౦౪౨ ౯౯౩౩౯
నాగార్జునసాగర్ 312.05 3౧౧.౪5 ౪౯౦౧౩ ౪౯౦౧౩
పులిచింతల 45.77 45.౫౧ ౨౯౮౨౦ ౩౩౨౨౬౮
గోదావరి బేసిన్.. (సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి)
సింగూరు 29.917 15.౬౫ ౧౮౯౫ 391
నిజాంసాగర్ 17.800 4.7౯ ౦ 0
శ్రీరాంసాగర్ ౯0.౩00 5౪.౯౮ ౨౪౦౭౩ 38౨2
కడెం 7.600 7.౧౮ ౫౨౧ ౪౬౨౮
ఎల్లంపల్లి 20.175 ౧౭.౭౬ ౧౦౪౭౮ ౧౩౦౫౨
మేడిగడ్డ 16.170 9౨.౪౦(మీ.) ౩౧౦౦౮౦ ౩౧౦౦౮౦
సమ్మక్క సాగర్ 6.940 7౮.౨0(మీ) ౩౮౦౪౯౦ ౩౮౦౪౯౦
దుమ్ముగూడెం 36.57 5౧.౨౦ (మీ) ౨౩౯౨౨౦ ౨౩౯౨౨౦
భద్రాచలం ఎత్తులో 3౯.౫౭ (మీ) ౨౨౮౦౧౬ ౨౨౮౦౧౬