calender_icon.png 1 March, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పిపోయిన వ్యక్తిని గుర్తించి పట్టుకున్న కానిస్టేబుల్

01-03-2025 12:26:26 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 28, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం లోని గ్రంథాలయం దగ్గర శుక్రవారం రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయిలుకి తప్పి పోయిన వ్యక్తి కనిపించడం తో గుర్తించారు.

వెంటనే హనుమంతు కిష్టయ్య కుటుంబానికి సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు చేరుకొని తప్పు పోయిన కిష్టయ్యను గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. వారు కానిస్టేబుల్ సాయిలు కి కృతజ్ఞతలు తెలిపారు.