సూసైడ్ నోట్ వీడియో.. సోషల్ మీడియాలో పోస్ట్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుర్గం పహాడ్ కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యాయత్నం సూసైడ్ నోట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సదరు కానిస్టేబుల్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే బూర్గంపాడు మండలంలో గంజాయికి సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ వీడియో రిలీజ్ చేసిన కానిస్టేబుల్ ఈ సంఘటనలో బడా బాబుల హస్తం ఉందని వెల్లడి.
కానిస్టేబుల్ సూసైడ్ వీడియో పలువురు బిఆర్ఎస్ నాయకులు ఎస్ఐల అండదండతో గంజాయి దందా సాగిందని తనను అన్యాయంగా ఇరికించినట్లు వీడియోలో వెల్లడి చేసిన అంశం వైరల్ గా మారింది. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సమాచారం. అశ్విని జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు, డాడి జాగ్రత్త అంటూ కొడుకు, జాగ్రత్తలు చెప్పి నిందలు మోయలేకపోతున్నా ఎస్సై రాజకుమార్, సంతోష్ లు చేసిన పనికి తాను నిందలు మోయాల్సి వస్తుందని ఇది భరించలేకపోతున్నాను అంటూ వీడియోలో సందేశం ద్వారా తన ఆవేదనను వెల్లడించారు. ఒక ఎస్సై మరో వ్యక్తి కలిసి గంజాయి వ్యాపారం చేశారని, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో గంజాయి పోతే ఎస్సై ను అడగాలి కానీ తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు సాగర్. వీడియోలో కానిస్టేబుల్ సాగర్ చేసిన ఆరోపణ పలువురు ఖండిస్తున్నారు.