calender_icon.png 4 January, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ ఆత్మహత్య..

01-01-2025 11:55:12 PM

మలక్‌పేట: పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జతావత్ కిరణ్(36)  ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. కిరణ్ కు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. బుధవారం ఉదయం జాతావత్ కిరణ్ తన భార్యతో గొడవపడి ఇంట్లోనే ఉన్నాడు. భార్య పిల్లలను కిందికి పంపించి పైన గదిలో కిరణ్ గడియ పెట్టుకుని ఉన్నాడు. గొడవపడినప్పుడు ప్రతిసారి కిరణ్ ఇదే విధంగా చేస్తుండడంతో యధావిధిగా వారు కిందికి వెళ్లిపోయారు.

మధ్యాహ్నం వరకు కిరణ్ ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికిలో నుంచి భార్య తొంగిచూసింది. కిరణ్ వేలాడుతూ ఉండడం కనిపించడంతో ఆందోళన చెంది కేకలు వేసింది. మృతుని భార్య సోదరుడు అక్కడికి చేరుకుని కిటికినీ బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. ఫ్యాన్ సీలింగ్‌కు ఉరేసుకుని వేలాడుతూన్న కిరణ్ ను కిందికి దించి చికిత్స కోసం యశోద దవాఖానకు తరలించారు. కాగా, కిరణ్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.