calender_icon.png 2 March, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు

01-03-2025 10:45:00 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పారం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నెన్నెల పోలీస్ స్టేషన్ లో విధులను ముగించుకొని తన స్వగ్రామమైన ఎల్లారంకు టీఎస్ 19 హెచ్ పల్సర్ బైక్ పై వస్తున్న కానిస్టేబుల్ భాగాల సంతోష్ ను ఎదురుగా అతివేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సంతోష్ కుడి కాలు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంతోష్ భార్య భాగాల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.