21-03-2025 05:22:43 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): క్రీడల పట్ల ఆసక్తి ఉన్న సిబ్బందిని ప్రోత్సహిస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. హర్యానా రాష్ట్రం మధుబన్ లో 73వ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్(73rd All India Police Sports Meet)లో సెపక్ తాక్రా క్రీడల్లో(Sepak Takraw Sports) రాష్ట్ర పోలీస్ బృందం తరపున పాల్గొని బ్రాంచ్ మెడల్ సాధించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గోపిని శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో శాలువాతో సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు పేరు తీసుకొచ్చారని కొనియాడారు. క్రీడలు ఆడడంతో మానసిక ప్రశాంతత కలగడంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, కిరణ్ పాల్గొన్నారు.