మహబూబ్ నగర్, జనవరి 6 ( విజయ క్రాంతి): విధి నిర్వహణలోనే ఏఆర్ కానిస్టే బుల్ వెంకటేష్ అకస్మాత్తుగా గుండెపోటు తో మరణించిన చేదు సంఘటన మహబూ బ్ నగర్ జిల్లా జైలు దగ్గర చోటు చేసుకుంది. సంబంధిత పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాల యం నుండి జైలు కి వెళ్లి, ఖైదీని కోర్టులో హాజరు పరచారు.
తిరిగి ఆ ఖైదీని జైలుకు అప్పగించిన తరువాత బయటకు వస్తున్న తరుణంలో కానిస్టేబుల్ వెంకటేష్ (50) ఛాతీలో నొప్పి రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ మిగతా సిబ్బంది హుటాహు టిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకె ళ్ళగా, చికిత్స పొందుతూ మరణించారు. విధుల్లో అకస్మాత్తుగా మరణించిన కానిస్టే బుల్ వెంకటేష్ మృతి పట్ల జిల్లా ఎస్పీ జాన కి తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.