calender_icon.png 16 January, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

07-08-2024 04:29:00 PM

హవేలీ ఘనపూర్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా, హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ తండాకు చెందిన బానోతు దుర్గపతి(50) మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఫరీద్ పూర్ తాండ నుంచి బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యలో అదుపుతప్పి కింద పడిపోయాడు.

ఈ ప్రమాదంలో దుర్గపతి  తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న స్థానికులు దుర్గపతిని గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహన్ని మర్చురీ రూమ్ కి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.