calender_icon.png 20 March, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులను ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్

20-03-2025 08:58:59 AM

హైదరాబాద్: కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు ఢీకొని కానిస్టేబుల్(Constable) రవికుమార్ మృత్యువాత పడ్డాడు. కామారెడ్డిలోని గాంధారిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులను కారు ఢీకొట్టింది. రోడ్డు పక్కన నిల్చున్న కానిస్టేబుళ్లపైకి కారు వేగంగా దూసుకొచ్చింది. కారు ఢీకొని కానిస్టేబుల్ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో కానిస్టేబుల్ సుభాష్ కు గాయాలయ్యాయి. సుభాష్ ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.