calender_icon.png 28 December, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

13-10-2024 04:30:43 PM

దసరా పండుగకు పసునూరు గ్రామానికి వచ్చి బంధువులు, మిత్రులతో హడావిడి.. ఆదివారం గుండె నొప్పితో మృతి.

పసునూరు గ్రామంలో అల్ముకున్న విషాద ఛాయలు

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూర్ గ్రామములో కానిస్టేబుల్ చిత్తలురి హరీష్(40) గుండె నొప్పితో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తలూరి హరీష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్టుగుడలోని పోలీస్ స్టేషన్లో  కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దసరా పండుగకు  భార్య పిల్లలతో కలిసి పసునూరు సొంత ఊరికి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చాడు. పండగ రోజు కుటుంబ సభ్యులతో  మిత్రులతో కలిసి సంతోషంగా గడిపారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గుండె దగ్గర నోస్తుంది అంటే ఇసిజి తీసుకుందాం అని మిత్రుడు జనకిరాములుతో కలిసి తుంగతుర్తి వెళ్ళే సమయంలోనే మార్గం మధ్యలోనే చనిపోయాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు. దీనితో పసునూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.