calender_icon.png 3 December, 2024 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్​తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

13-10-2024 08:03:30 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ గన్ తో ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ కాలనీలో గుడిబైన శ్రీనివాసు అనే కానిస్టేబుల్ భార్య, కుమారుడితో నివసిస్తున్నాడు. దీంతో కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం విధులు నిర్వహిస్తున్నాడు.

గత ఐదు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జగురుతున్నాయి. మనస్థాపంతో ఆదివారం శ్రీనివాసులు కలెక్టరెట్ లోని స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సీ సుధీర్ పేర్కొన్నారు.