భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన క్లూజ్ టీం కానిస్టేబుల్ రమణారెడ్డి శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో రామనారెడ్డికి సంబంధించిన చెప్పులు సెల్ ఫోను ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని భద్రాచలం సిఐ వై సంజీవరావు, ఎస్సై విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.