ముషీరాబాద్, జనవరి 5: అనారోగ్య సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటలోని మల్లికార్జున్‌నగర్ ప్రాంతానికి చెందిన భానుశంకర్ (47) వృతితరీత్యా వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
గత 5 ఏండ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో సమస్యలతో భానుశంకర్ బాధపడుతున్నాడు. అనేక ఆస్పత్రులు తిరిగినా నయంకాకపోవడంతో మనస్థాపంతో జీవితంపై విరక్తి చెందిన భానుశంకర్ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భానుశంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.