12-04-2025 08:35:27 PM
దౌల్తాబాద్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలని కుట్రలు చేస్తుందని భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ నడుంబిగించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం ఆరేపల్లి, ముంగిస్ పల్లి, రాంసాగర్, కొత్తపల్లి గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించి గ్రామ స్వయం పరిపాలనకు నాంది పలికిన గాంధీ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే స్వయంగా 20 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎన్నికలలో డబ్బులు పంచి గెలిచారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నామని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ 500 సబ్సిడీ, రైతు భరోసా, రుణమాఫీ, ఏడాది కాలంలోనే 56 వేల ఉద్యోగాలు, ఇండ్లలేని నిరుపేదలకు విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు, పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం, ప్రజలందరికీ నిరంతరం సన్న బియ్యం అందజేయడానికి సన్నరకం వడ్లు పండించేందుకు ప్రోత్సాహకంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
అలాగే నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా నాలుగు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ విజయభాస్కర్ రెడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల అధ్యక్షులు తప్పటి సుధాకర్, పడాల రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శశికాంత్, నాయకులు కిష్టారెడ్డి, భూపతి రావు, ఇప్ప మల్లేశం, లాలు, స్వామి, దయాకర్, ప్రశాంత్, ఇంద్రకరణ్, మల్లేశం, సురేష్, రామకృష్ణ, యాది రెడ్డి, పుర్ర నర్సింలు, కరుణాకర్, జానీ, లక్ష్మణ్, కిరణ్, శ్రీనివాస్, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు.