calender_icon.png 20 March, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర

20-03-2025 01:38:44 AM

  • కేంద్రానికి వ్యతిరేకంగా 24, 25 సమ్మె
  • యూఎఫ్‌బీయూ కన్వీనర్ ఆంజనేయప్రసాద్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (విజయక్రాంతి): ప్రభుత్వ బ్యాంకులను నిర్వీ ర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చే స్తోందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రాష్ట్ర కన్వీనర్ కె.ఆంజనేయప్రసాద్, నాయకులు రాంబాబు, వెంకటరా మయ్య, శ్రీనివాస్‌శాండిల్య, ఫణికుమార్, వెంకటరమణ, రాజ్‌కుమార్, శ్రీమోహన్ అ న్నారు. బుధవారం నారాయణగూడలోని ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసి  గెస్ట్‌హౌజ్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో పని చేస్తు న్న ఉద్యోగులు మెరుగైన సేవలందిస్తున్నా ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడిలో దాదాపు 500మంది వివిధ బ్యాంకుల ఉ ద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఖాళీలను భర్తీ చేస్తే దాదాపు 2లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభు త్వ బ్యాంకులను కాపాడుకునేందుకు ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె చేస్తామన్నారు.