calender_icon.png 29 November, 2024 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర

15-10-2024 02:50:21 AM

మాజీ ఎంపీ వినోద్‌కుమార్ 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను కనుమరుగు చేసేందుకు రేవంత్ సర్కార్  కుట్రలు చేస్తుందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 2,500 మంది విద్యార్థులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి భవనాలు మాత్రమే నిర్మిస్తున్నట్టు జీవోలో పేర్కొనడం దారుణమన్నారు.

1,023 గురుకులాలను ఉంచుతారా? ఊడగొడుతారో సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గుర్తులను రేవంత్‌రెడ్డి తుడిచివేయలేడని, అది ఎవరితరం కాదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, డిపీఆర్‌లను చూస్తే గురుకులాలను విలీనం చేస్తున్నట్టు ఉందన్నారు. గురుకులాలు లేకుండా చేయాలని ఎత్తుగడలు వేస్తే సహించేదిలేదని, వాటిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.