calender_icon.png 7 October, 2024 | 7:55 AM

హిందువులను విభజించే కుట్ర

07-10-2024 01:38:20 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫైర్

జైపూర్, అక్టోబర్ 6: హిందువులను విభజించేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నారని రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. రాజస్థాన్‌లోని బరన్ పట్టణంలో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారత్ పక్కా హిందూ దేశమని, అలాంటి దేశం లో కాంగ్రెస్ నేతలు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. భాష, కులం, మతం, ప్రాంతం వంటి విభేధాలను పక్కన పెట్టి హిందువులంతా ఏకంగా కావాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ యాం త్రికమైన సంస్థ కాదని, అది పెద్ద సమూహ క్షేత్రమని అభివర్ణించారు.

ఎంతో మంది సంస్థతో కోసం కట్టుబడి పనిచేస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ అంటే విలువలకు కేరాఫ్ అని కొనియాడారు. సంస్థ పరిధిలో పనిచేస్తున్న వలంటీర్లు (సర్సంఘ చాలక్) స్థానికంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను బలోపేతం చేయాలని సూచించారు. నిరుపేదలకు విద్య, వైద్య సాయం అందేలా చొరవ తీసుకోవాలన్నారు.