calender_icon.png 10 March, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ సబ్ క్యాటగిరీ విషయంలో మోసానికి కుట్ర

10-03-2025 01:25:27 AM

మాజీ డిప్యూటీ సీఎం తాటి రాజయ్య

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఎస్సీ సబ్ క్యాటగిరీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్‌ఎస్ నేత డా క్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. 30 ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీక రణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని.. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముం దుగా తెలంగాణలో వర్గీకరణ అమ లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు.

అయితే ఎస్సీలను మోసం చేయాలని దురు ద్దేశంతోనే గ్రూప్స్ ఉద్యోగాల ఫలితాల విడుదలకు పూనుకున్నార న్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఎస్సీలను ఏ, బీ, సీ లుగా వర్గీకరణ చేయాలని సూచించిందని, అయితే వర్గీకరణ నివేదిక తప్పుల తడకగా ఉందని మాదిగ, మాదిగ ఉప కులాల నేతలు అభ్యంతరం తెలిపారని అన్నారు.

ఆర్థికంగా ఎదిగిన కులాలను గ్రూప్ ఏ లో ఉంచారని ఆరోపించారు. ఆర్థికంగా వెనకబడిన మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు గువ్వల బాలరాజు, డాక్టర్ మెతుకు ఆనంద్, డాక్టర్ ఆర్‌ఎస్ ప్ర వీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.