calender_icon.png 7 November, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహాల ధ్వంసంలో కుట్ర

07-11-2024 02:22:55 AM

  1. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు   
  2. కులగణన ప్రారంభంపై సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వీహెచ్

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసంపై కుట్ర జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చ జరగకుండా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు.

కులగణన చేయడం వల్లే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్‌గాంధీ భావించారని, అందుకే గత ఎన్నికల్లో కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది చెప్పకుండా రాహుల్‌ది ఏ కులమని ప్రశ్నించడం సరికాదన్నారు. రాహుల్‌ది హిందూ మతమని, బ్రాహ్మణ కులమని బీజేపీ నేతలకు తెలియాదా అని  నిలదీశారు.

ఇంత గొప్ప నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అభినందించాల్సి పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వీహెచ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కుల గణన చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయని అన్నారు.