calender_icon.png 27 September, 2024 | 6:56 PM

హసీనాను దించేయడం వెనక కుట్ర

27-09-2024 12:53:30 AM

అమెరికా పర్యటనలో యూనస్ వ్యాఖ్యలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: షేక్ హసీనాను ప్రధాని పీఠం నుంచి దించేయడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆ దేశ తాత్కాలిక సారథి, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ప్రసంగించారు. యూనస్ మాట్లా డుతూ.. విద్యార్థి నేతలు బంగ్లాదేశ్‌కు కొత్తరూపు తీసుకొచ్చారని కొనియాడారు. హసీ నాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో తెలియదు కానీ..

మహఫుజ్ అబ్దు ల్లా ఉండొచ్చని పరోక్షంగా కామెంట్ చేశారు. హసీనాను దించే కుట్రలో విదేశీ హస్తం ఉందని గతంలోనూ వార్తలొచ్చాయి. అమెరికా పేరు కూడా వినిపించింది. బంగ్లాకు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే .. తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తానని ఓ దేశం ఆఫర్ ఇచ్చినట్లు మేలో హసీనా కామెంట్ చేశారు. అది అమెరికానేనని ప్రచారం జరిగింది. అలాగే ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికలు పారదర్శకంగా సాగలేదని గతంలో అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.