calender_icon.png 8 April, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్ర

17-03-2025 12:00:00 AM

అడవిలో చెట్లమీద

యధేచ్చగా సాగుతున్న వేట

కారణమేంటని రాజ్యాన్ని ప్రశ్నిస్తే...

ఆయుధాలున్నాయన్న అనుమానమంది

ఆయుధాలేవి? అని ప్రశ్నిస్తే..

నేల రాలిన చెట్లను చూపుతున్న రాజ్యం

ఆయుధాలేవని మరోసారి గట్టిగా ప్రశ్నిస్తే

వాటి లోపటున్నాయేమోననే..

మొదల్లకు నరికి వాటిని 

చీల్చి వేతుకుతున్నామనే

దురుసు సమాధానం

ఏళ్ళు గడిచాయి

చెట్లు నేలరాలిన ప్రాంతంలోనే

తవ్వకాలు చేస్తున్న రాజ్యపు ప్రేమికుడు

అడవినెందుకు తవ్వుతున్నారంటే..

అడవెక్కడుందని ఎదురు ప్రశ్న?

ఆంతరంగికుడికి వంతపాడిన రాజ్యం

ఇద్దరూ కలిసి చేస్తున్న గేలి వికట్టహాసానికి

అడవంత ప్రశ్న నా మొఖాన మొలిస్తే..

లోలోనంత గింగిరాలు తిరుగుతున్న సమాధానం

కుట్ర..కుట్ర....కుట్ర....

కుట్ర....కుట్ర...కుట్ర....