13-12-2024 12:58:53 AM
దాసోజ్ శ్రవణ్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆయన గురువారం స్పందిస్తూ.. జైల్లో ఉన్న రైతుకు గుం డె సంబంధిత సమస్య వస్తే సంకేళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎంతవరకు న్యాయమన్నారు. వారికి జైలు లో కనీస వైద్యం అందించడంలేదని, ఎన్ని రోజులు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకుంటారని ప్రశ్నించారు.