మాజీ మంత్రి కొప్పుల
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో గురుకుల పాఠ శాల వ్యవస్థను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో ఇప్పటివరకు 34 మంది చనిపోయారని, పేద పిల్లలు చనిపోతే సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శనివా రం తెలంగాణ భవన్‌లో మాట్లాడు తూ.. పాలమాకులలో పిల్లలు కారం తిండి తినలేక రోడ్డెక్కారని, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి పాఠశాలల పరిస్థితులపై విద్యాశాఖ అధికారులతో వెంటనే సమీక్ష చేయాలని సూచించా రు.
నాణ్యమైన తిండి పెట్టడం లేదని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలల విద్యార్థుల చదువులను పూర్తిగా విస్మరిం చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల ఖర్చు చేసిందని, సీఎం రేవంత్ బడాయి మాటాలు చెప్పడం తప్ప చేతలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఏ ఒక వ్యవస్థ సంతృప్తిగాలేదన్నారు. గురుకులాల పరిస్థితుల పై ముఖ్యమంత్రి స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.