ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర పాలనను ఎటు వైపు రేవంత్‌రెడ్డి తీసుకెళ్లుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడు తూ తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్ర యత్నం చేశారని, తాను మందు తాగననే అనే విషయం వాళ్లకు తెలియదన్నారు.
తనను కేసు లో ఇరికించకుండా ఎందుకు వదిలేశారని ఇంటెలి జెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని సీఎం తిట్టారని, తమకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి కౌశిక్ రెడ్డి కారులో పెట్టాలని చెప్పారని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు. తన ఫోన్‌తోపాటు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు.
డ్రగ్ టెస్ట్‌కు రావాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు పాడి తెలిపారు. ఛాలెంజ్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, ఎక్కడికి రావాలో చెప్పాలని, అక్కడికి కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రావాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో చూడలేదని, ఏక్ పోలీస్ అని రేవంత్ పొంక నాలు కొట్టారని ఎద్దేవా చేశారు.