- ఇంతవరకు ఎందుకు ఆగారు
- పిల్లలు చనిపోతుంటే ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయింది
- మంత్రి సీతక్కపై బీజేపీ నేత కాసం ఫైర్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకుల సంక్షేమ హా స్టళ్లలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోవడం వెనక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉం దంటూ మంత్రి సీతక్క చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో స్పందించారు.
ఇన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నట్లు కుట్ర ఉందని తెలిసినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యార్థు ల మరణాణాలకు ముందే కుట్రను బయటపెట్టినట్లయితే వారి ప్రాణాలు దక్కేవని అ న్నారు. విద్యార్థులు చనిపోతున్నా ఏం చేశారని నిలదీశారు. అన్నీ ముందే తెలిసినా ప్ర భుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇ ప్పటివరకు ఎందుకు ఆగారని ప్రశ్నించారు.
పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పిల్లలు చనిపోతుంటే ఇంటెలిజెన్స్ ఎక్కడికి పో యిందని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలోనే మూడుసార్లు ఫుడ్ పాయిజన్ జరిగిందన్నా రు.
ఈ ఘటనలో సస్పెండైన డీఈవో మ హ్మద్ అబ్దుల్ ఘనీకి వనపర్తి డీఈవోగా అ దనపు పోస్టింగ్ ఇచ్చి, తిరిగి ఒక్క రోజులోనే మళ్లీ పేట డీఈవోగా బాధ్యతలు అప్పజెప్పారని ఇది అవినీతి అధికారులకు వత్తాసు ప లకడమేనని మండిపడ్డారు. మురళి, కోదండరాం వంటి విద్యావేత్తలు స్పందించడం లేదని, కనీసం హాస్టళ్లను కూడా సందర్శించడం లేదన్నారు.
వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతిపై తామెందుకు కారణమంటూ మం త్రులు ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తు చేశారు. రేవంత్ విద్యావ్యవస్థను గాలికొదిలేసి పాలనను ఆగం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టళ్లుగా మారిపోయాయని, ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలే దన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ గురుకుల పాఠశాలల్లో 51 మంది వి ద్యార్థులు చనిపోయారని, 23 మంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. 10 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారన్నారు. ౪ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో, 14మంది అనారోగ్యంతో చనిపోయారన్నా రు. రాష్ర్ట వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.