calender_icon.png 7 February, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణపై కుట్రలు సాగవు

07-02-2025 01:13:55 AM

  • అడ్డుకోవాలని చూసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారు

మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాం తి): మాదిగల సమష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, సీఎం రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ పేర్కొన్నారు. బట్టేబాజ్ మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వాడిని తాను కాదని, ఎవరికీ భయపడబోమన్నారు.

వివాదాలు సృష్టించి అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధిచెప్తారని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో(మినిస్టర్స్ క్వార్టర్స్) మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, ప్రజలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడారు.. వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో 14 ఏండ్లు పెండింగ్‌లో ఉందని,  రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఇప్పుడు చేసిచూపించమన్నారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన రోజే క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు సుమారు 9.8 శాతం రిజర్వేషన్లు సాధించామని.. గ్రూప్ 0.77 శాతం, గ్రూప్ 9 శాతం మాదిగ, మాదిగ ఉపకులాలకే వచ్చిందన్నారు.  వర్గీకరణ జరగడం ఇష్టంలేని వ్యక్తులు, వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, వ్యక్తిగత విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. 

మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

వైద్యారోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మెడికల్ అండ్ హెల్త్ మాస్ మీడియా అధికారులదే కీలక పాత్ర అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

గురువారం మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. మెడికల్ అండ్ హెల్త్ గెజిటెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొప్పు ప్రసాద్, కిరణ్‌రెడ్డి, కోశాధికారి తిరుపతిరెడ్డి, సహ అధ్యక్షులు జక్కుల రాములు, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, కటకం శంకర్, శ్రీనివాస్, రేష్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.