హైదరాబాద్: బీఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. సబిత, సునీతను సొంత అక్కలుగా భావించానని సీఎం వెల్లడించారు. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేదసి ఏం అనలేదని సీఎం తెలిపారు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని గుర్తుచేశారు. అప్పుడు కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు.