calender_icon.png 29 September, 2024 | 3:04 PM

చెరువుల పరిరక్షణ మనందరి బాధ్యత

05-09-2024 02:49:32 PM

కరీంనగర్, (విజయక్రాంతి): త్రాగునీరు సాగునీరు ప్రజలందరికి అందించాలనే దూర దృష్టితో మన పూర్వీకులు ప్రతి గ్రామంలో చెరువులు త్రవ్వించాలని కల్పతరువు వంటి అది ప్రజలందరి ఉమ్మడి ఆస్తిగా భావించి వాటిని కాపాడు కోవలసిన బాధ్యత గ్రామప్రజలదేనని సర్వోదయ సేవ సమితి అధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఉదయం సర్వోదయ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాలను పంచిపెట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చెరువులు తరతరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని చెరువు నిండితే రైతు సోదరులకు బ్రతుకు తెరువు అటువంటి చెరువులను ఇతరులు ఆక్రమించుకోకుండా కలుషితం కాకుండా కాపాడుకోవాలని మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే చెరువులో నిమజ్జనం చేయాలని ప్రజలను ఆయన కోరారు.

ఈ సందర్బంగా హైదరాబాద్లో పకడ్బందీగాహైడ్రా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు కరీంనగర్ జిల్లా సర్వోదయ సమితి ముఖ్యమంత్రిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ,వ్యవస్థాపక అధ్యక్షులు తోట లక్ష్మణ రావు,కోశాధికారి కొమురవెళ్లి వెంకటేశం,ఉపాధ్యక్షులు పాత వెంకటనర్సయ్య,కట్కూరి సుధాకర్,కొంతం కృష్ణమూర్తి,జంధ్యం మధుకర్, గాదె నీలకంఠ, తొడుపునూరి దశరథం, మంచాల కిషన్,తాటిపాముల శ్రీనివాస్,యంసాని జగదీశ్వర్, తొడుపునూరి రాకేష్ ,గంగిశెట్టి సత్యనారాయణ, మంచాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.