12-02-2025 06:33:08 PM
షేక్ యాకుబ్ షావలి రాష్ట్ర అధ్యక్షులు..
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) కొత్తగూడెం జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల అడ్డాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్ యాకుబ్ షావలి, పి సతీష్ మాట్లాడుతూ... టియుసిఐ ఈ జిల్లాలో ఇప్పటికే సింగరేణి, మున్సిపల్, గ్రామపంచాయితీ, కేజీబీవీ, తదితర రంగాల కార్మికుల అనుబంధ సభలు జరిగాయని ఈనెల 16న కొత్తగూడెంలోని ఉర్దూగర్, ఫంక్షన్ హాల్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధమ మహాసభ జరుపుకుంటుందన్నారు.
ఈ మహాసభకు జిల్లాలోని కార్మికులు అసంఘటితంగా పాల్గొని, కార్మికుల కనీస వేతనంతో పాటు చట్టబద్ధ హక్కులు, లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా, పోరాటాలకు సిద్ధం చేయడం కోసం ఈ మహాసభ జరుపుకుంటున్నామని, ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని భవిషత్ పోరాటాలకు ఈ జిల్లా వేదిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి పి సతీష్, సంధ్య, కృష్ణ, కరుణ శాంత, మంగ, భగవాన్ రామకృష్ణ, భాగ్యలక్ష్మి, నిర్మల, నరసింహ తదితరులు పాల్గొన్నారు.