calender_icon.png 22 March, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయానికి ‘ఏఐ’ అనుసంధానం

22-03-2025 12:30:38 AM

  1. సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి
  2. రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులతో అసెంబ్లీ ఆవరణలో భేటీ 

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాల జీలను వ్యవసాయానికి అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పే ర్కొన్నారు. తద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంపై జర్మనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు.

శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలో ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీలతో అన్ని రంగాల పరిశ్రమలను అనుసంధానించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను జర్మన్ ప్రతినిధులకు మంత్రి వివరించారు.

సాగులో రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదన్నారు. విదేశాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ మానవ ప్ర మేయం లేకుండా ‘అగ్రి రోబో’లే వ్యవసా యం చేసే రోజులు త్వరలో వస్తాయన్నా రు.

కార్యక్రమంలో బృంద సభ్యులు డా.సెబాస్టిన్ బోస్, మార్టిన్, స్వెన్, డా.రఘు చాలిగం టి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.జానయ్య, రీసెర్చ్ డైరెక్టర్ డా.బలరాం, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా.రాములు, డిజిటల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డా.బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.