calender_icon.png 23 February, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మనుగడ కష్టమే

23-02-2025 12:32:18 AM

బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి డకౌట్ అయిందని, అలాంటి పార్టీపై రేవంత్‌రెడ్డి లాంటివారు ఎనలేని ప్రేమను పెంచుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే  లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుండగా, బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఆయన చెప్పారు. దేశంలో అవినీతి రహిత మోదీ పాలనకు ప్రజలు జై కొడుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ అబాసుపాలైందన్నారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు పోట్లాడుకుంటున్నారని విమర్శించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు అయిందని, కనీ సం అభ్యర్థిని పెట్టే సాహసం చేయలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ అరువు తెచ్చు కున్న వ్యక్తిని బరిలోకి దింపిందన్నారు. గతంలో కేసీఆర్ ఉద్యోగులకు దగా చేస్తే రేవంత్‌రెడ్డి డబుల్ దగా చేస్తున్నారన్నారు.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఏంటో ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అప్పు డు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అప్పుల కుప్పగా మార్చాయని, కొత్త పీఆర్‌సీ తెస్తామన్న రేవంత్‌మాట తప్పాడన్నారు. మరో వైపు ముస్లింలను కలిపి బీసీ రిజర్వేషన్లను ఇవ్వడం ఘోరమని వాపోయారు. రేవంత్‌కు కాంగ్రెస్ కొత్త అని, ఆ పార్టీ డీఎన్‌ఏ ఆయనకు సరిగా తెలియదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌లో ముక్కు నేలకు రాసి ఓట్లు అడగాలన్నారు.