24-03-2025 12:00:00 AM
సంగారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం జై భీమ్, జై బాపు, జై సమ్మదన్ అనే నినాదంతో గ్రామస్థాయిలో ఏడాది పాటు పాదయాత్ర నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగంలో మార్చే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, మాత్మ గాంధీ, జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బిజెపి ఆలోచన విధానాలను ప్రజలకు తెలిపేందుకు పాదయాత్ర చేస్తున్నామన్నారు.
బిజెపి పాలనలో భారత రాజ్యాంగానికి రక్షణ కరువైందన్నారు. ప్రస్తుతం ప్రజలకు భారత రాజ్యాంగం గురించి గ్రామస్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉంద న్నారు. కాంగ్రెస్ పార్టీతోని భారత రాజ్యాంగానికి పరిరక్షణ ఉందని ప్రజలకు తెలుప వలసిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీమంత్రి, జహీరాబాద్ నియోజ కవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.