07-02-2025 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా లెంపలేసుకుని రాష్ట్రంలో పాలనను కొనసాగించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో సమా వేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభు త్వాన్ని నడపడం చేతకావడం లేదని దీంతోనే రాష్ట్రాల్లో పాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు.
కొందరు అనామకులు మేమున్నామని చెప్పుకునేం దుకు మొరుగుతున్నారన్నారు. సిఐడితో కాకుండా సిఐఏ తోఎంక్వరీ చేయించినా ముందుగా జైలుకు పోయేది రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి14 నెలలు గడుస్తున్నా కెసిఆర్ మీద ఏడుపు ఆపడం లేదని ఆరోపించారు. కెసిఆర్ సర్వే అంటే దేశ విదేశాలనుంచి స్వచ్చందంగా తరలివచ్చారన్నారు.
కానీ మీ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నారన్నారు. చివరకు లక్ష డప్పులు.. వేల గొంతుల కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికే ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను పూర్తిగా అమలుచేయాలన్నారు. సమావేశంలో పలువురు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు